కేంద్ర మంత్రి శ్రీ టోఖన్ సాహు ని కలిసిన పత్తికొండ బీజేపీ మండల అధ్యక్షుడు కరణం నరేష్
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: అనంతపురం జిల్లాలోని ధర్మవరం టోల్ ప్లాజా సమీపంలో కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ టోఖన్ సాహు ని పత్తికొండ బీజేపీ మండల అధ్యక్షుడు కరణం నరేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం, పత్తికొండ మండల పరిధిలోని పేద, నిరుపేద కుటుంబాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం ద్వారా అధిక సంఖ్యలో ఇళ్లను మంజూరు చేసి, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా లక్షలాది పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను అందించడం గొప్ప ప్రజాసేవ అని పేర్కొంటూ, పత్తికొండ నియోజకవర్గంలోని అర్హులైన పేద ప్రజలకు మరిన్ని ఇళ్లు మంజూరు చేసి, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శ్రీ టోఖన్ సాహు గారు పత్తికొండ నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఇళ్ల మంజూరు విషయంలో అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు కరణం నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నాయకులు దాసరి నాగరాజు, ఎద్దుల దొడ్డి కృష్ణ, రామాంజనేయులు, అంజి, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


