PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘బ్యాక్​లాగ్​ నాన్​ డీఎస్సీ’ అర్హుల, అనర్హుల జాబితాపై అభ్యంతరం ఉంటే తెలపండి

1 min read

– విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : బ్యాక్​లాగ్​ నాన్​ డీఎస్సీ పరిధిలోని ఉద్యోగాలకు సంబంధించి మార్చి 2 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో అర్హుల, అనర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ విజయ కోరారు. జాబితాను కార్యాలయం పక్కనే నోటీస్ బోర్డుపై , వెబ్​సైట్​ www.kurnool.ap.gov.in నందు ఉంచామని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. అర్హుల, అనర్హుల జాబితాపై అభ్యంతరం ఉంటే ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయం ఈమెయిల్​ ఐడీ [email protected] కు లిఖితపూర్వకంగా పంపాలని తెలిపారు. కోవిడ్​ నిబంధనల దృష్ట్యా… మీ అభ్యంతర వినతిపత్రాలను పోస్టు ద్వారా కానీ, కార్యాలయ పనివేళల్లో అందజేయాలని ఏడీ విజయ వెల్లడించారు. గడువు తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమన్నారు.
​ డీఎస్సీ పరిధిలోకి రాని ఉద్యోగాలు (17)
జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, కర్నూలు( అంధులు) ల్యాబ్​ టెక్నిషియన్​కు ..
డబ్ల్యూడీఏఎస్​సీ​–ఎస్​ఆర్​డీఓబీఎల్​ 5(4) 2021– ఎస్​డీ( ఎస్​డీ)– డబ్ల్యూఏఎస్​డకే ఆర్​ఎన్​ఎల్​లో.. ఏడీ, హండ్​ల్యూమ్స్​ మరియు టెక్​టైల్స్​, కర్నూలు( అంధులు), జిల్లా పంచాయతీ (బధిరులు), కమిషనరు, కర్నూలు మున్సిపల్​ కార్పొరేషన్​ (బధిరులు), సూపరింటెండెంట్​ ఇంజనీరు, టీజీపీ సర్కిల్​ , నంద్యాల ( శారీరక వికలాంగులు) వారు కార్యాలయపు సబార్డినేట్​ / అటెండర్​ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా కమిషనరు, కర్నూలు ( అంధులు), కమిషనరు, ఆదోని మున్సిపాలిటీ (శారీరక వికలాంగులు) పీ.హెచ్​ వర్కర్​ పోస్టుకు, కమిషనర్​, డోన్​ మున్సిపాలిటీ (అంధులు మరియు బధిరులు) పీహెచ్​ స్వీపర్​ పోస్టుకు, డివిజనల్​ ఫారెస్టు కార్యాలయం (డబ్ల్యూ ఎల్​) నంద్యాల డివిజన్​, డోన్​ మున్సిపాలిటీ (అంధులు) ఆఫీస్​ వాచర్​ పోస్టుకు, జిల్లా విద్యాశాఖ , కర్నూలు( అంధులు) స్వీపర్​, కమిషనరు , కర్నూలు మున్సిపాల్​ కార్పొరేషన్​( అంధులు) పార్కు మాలి, కమిషనరు కర్నూలు మున్సిపల్​ కార్పొరేషన్​ (అంధులు) మజ్దూరు పోస్టు.

About Author