NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

” ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్  తనిఖీ చేసిన జడ్జి “

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్  స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి ఈ రోజు అనగా 31-10-2026 న కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర గల బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టల్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలను అడిగి వారికి అందుతున్న భోజనం వసతి సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి పౌష్టికాహారాలుతో కూడిన భోజనాన్ని ప్రతిరోజు అందించాలని వార్డెన్ లను ఆదేశించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్ లను హాస్టల్ రికార్డులను పరిశీలించారు. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, NALSA (పిల్లలకు బాల-స్నేహపూర్వక న్యాయ సేవలు మరియు వారి రక్షణ) పథకం, 2024, సంక్షేమ పథకాలను గురించి అవగాహన కల్పించారు మరియు వారికీ ఏవైనా చట్టపరమైన సమస్యలుంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 కు కాల్ చేస్తే వెంటనే న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ఈ సదస్సులో  హాస్టల్స్ వార్డెన్స్ శైలజ, బెన్నమ్మ మరియు పిల్లలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *