తెదేపా అభ్యర్థి అబుజర్ ను గెలిపించండి
1 min read
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ అబుజర్ ను గెలిపించాలని టిడిపి అందరికీ మరియు నాయకులు కోరారు.ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి వివరిస్తూ జడ్పిటిసి అభ్యర్థికి మరియు ఎంపిటిసి అభ్యర్థికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని గ్రామ టిడిపి నాయకులు సుధాకర్ రెడ్డి, ఇద్రిస్ అన్నారు.గ్రామాలను ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తూ ఉందని ఇంకా రాబోయే రోజుల్లో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంతోనే సాధ్యమని కావున ప్రజలు టిడిపి బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మక్బుల్ అహ్మద్,ఉబేదుల్లా, అజ్మతుల్లా,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


