NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద  ఎంపీటీసీ–2లో స్వతంత్ర అభ్యర్థి కొలిమి సలాం ప్రచార జోరు!

1 min read

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్న కొలిమి సలాం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం.. అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ

సిలిండర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రంలోని ఎంపీటీసీ–2 పరిధిలో స్వతంత్ర అభ్యర్థి కొలిమి సలాం ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఆయన వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను, స్థానిక ఓటర్లను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు, ఇబ్బందులు, గ్రామంలో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతపై ఆరా తీస్తున్నారు.ఈ సందర్భంగా కొలిమి సలాం మాట్లాడుతూ హొళగుంద ఎంపీటీసీ–2 పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చే వ్యక్తిగా కాకుండా, ఎన్నికల అనంతరం కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సేవలందిస్తానని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

హొళగుందలోని వార్డుల్లో రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే వరకు ప్రజల తరఫున పోరాడుతానని చెప్పారు.

ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత.. ప్రతి కుటుంబానికి అండగా

ఎంపీటీసీ–2 పరిధిలోని ఏ ఒక్క వార్డును నిర్లక్ష్యం చేయకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తన సంకల్పమని కొలిమి సలాం తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సమస్యలు, వృద్ధుల సంక్షేమం, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల అందజేత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే విధంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

పదవి కోసం కాదు.. ప్రజాసేవ కోసం ముందడుగు

ప్రజల ఆదరాభిమానాలు, ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచానని, ప్రజలు తనకు ఒక అవకాశం కల్పిస్తే వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కొలిమి సలాం అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని హొళగుంద అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కార దిశగా ముందుకు సాగుతానని వెల్లడించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ–2 పరిధిలోని ఓటర్లందరూ తనకు మద్దతుగా నిలిచి, స్వతంత్ర అభ్యర్థి కొలిమి సలాంకు కేటాయించిన గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలతోనే ప్రయాణం.. ప్రజల కోసమే ప్రయత్నం!

అభివృద్ధే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం!

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *