జక్కసానికుంట్ల ఎంపీటీసీ స్థానంపై కూటమి గురి!
1 min read
నాలుగు గ్రామాల్లో కూటమి అభ్యర్థి ప్రమీలకు విస్తృత ప్రచారం
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని జక్కసానికుంట్ల ఎంపీటీసీ స్థానంలో కూటమి అభ్యర్థి కె.బి. ప్రమీలను గెలిపించాలనే లక్ష్యంతో బీజేపీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం నల్లమేకలపల్లి, రాసవాండ్లపల్లి, రాంపురం, జక్కసానికుంట్ల గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, కూటమి అభ్యర్థి ప్రమీలకు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కె.బి. దామోదర్ నాయుడు, బీజేపీ మండల ఇన్చార్జి అంబంటి సుబ్బారెడ్డి, కె.సి. మద్దిలేటి, రామచంద్ర నాయుడు, నాగార్జున, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, హరి తదితరులు పాల్గొన్నారు.



