NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగుదేశం పార్టీ బీటలు వారాలి!

1 min read

జగనన్న చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి – ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ.. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచిన జగనన్నకు మద్దతుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.మన భవిష్యత్తుకు నిజమైన భరోసా కావాలంటే ప్రజల ఇంటి గడప వద్దకే సంక్షేమాన్ని తీసుకొచ్చిన వైఎస్ జగన్ నాయకత్వానికి అండగా నిలవాలని అన్నారు. స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, బుసినే విరుపాక్షి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *