జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ కనపర్తి అమర్నాథ్ కు మాతృ వియోగం
1 min read
ఘనంగా నివాళులర్పించిన నగర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, బంధుమిత్రులు
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రముఖ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ కనపర్తి అమర్నాథ్ మాతృ మూర్తి స్వాతంత్ర సమరయోధురాలు వరలక్ష్మి (97) స్థానిక రామకృష్ణాపురం తన స్వగృహంలో సోమవారంతుది శ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు అమర్నాథ్ సంతానం. వరలక్ష్మి భర్త కనపర్తి వెంకటేశ్వరరావు సబ్ రిజిస్టర్ గా సుమారు 35 సంవత్సరాలు సేవలందించారు. ఆమె మరణ వార్త తెలియగానే నగరంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, శ్రేయోభిలాషులు, కుమారుడు అమర్నాథ్ కు చరవాణి ద్వారా మరియు స్వయంగా భౌతిక కాయని సందర్శించి తమ ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


