NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జోరుగా జడ్పిటీసీ అభ్యర్థి రజియాభీ ప్రచారం

1 min read

ఆదరించండి ఆశీర్వదించండి..

మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి దూదేకుల రజియాబీ ప్రచారం జోరుగా సాగుతోంది.మండల పరిధిలోని 49 బన్నూరు, ఉప్పలదడియ గ్రామాల్లో జడ్పిటిసి అభ్యర్థి మరియు ఎంపీటీసీ అభ్యర్థి డి హసీనా సోమవారం ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గత వైకాపా ప్రభుత్వ హయాంలో చేపటం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ జగనన్న ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామాల్లో కంటికి అద్దంలా కనబడుతున్నాయని అన్నారు.జడ్పిటిసిగా నన్ను ఆదరించి ఆశీర్వదిస్తే మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె ఓటర్లతో అన్నారు.రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి,బన్నూరు మాజీ సర్పంచ్ జి భూదేవి, సాంబశివుడు,మోమిన్ మన్సూర్,శేఖర్ రెడ్డి,జ్ఞాన్ రెడ్డి,షేక్ అహ్మద్,హరీష్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *