NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

1 min read

హొళగుంద మండల అభివృద్ధికి ఒక్క అవకాశం కల్పించండి – జెడ్పీటీసీ అభ్యర్థి ఎల్లార్తి అంజిని

బ్యాలెట్ నమూనాలో క్రమ సంఖ్య 4.. బ్యాటరీ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి

ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం.. అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హొళగుంద మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా బీసీవై పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ఎల్లార్తి అంజిని మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను, అక్కచెల్లెమ్మలను, అన్నదమ్ములను కలుసుకుంటూ తనను ఒక్కసారి ఆదరించి జెడ్పీటీసీగా గెలిపించాలని అభ్యర్థించారు.బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆశీస్సులతో, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ నాయకత్వంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన కుటుంబానికి మండల స్థాయిలో గుర్తింపు ఇచ్చి జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం పట్ల ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అంజిని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని పేర్కొన్నారు.పదవిని అలంకారంగా కాకుండా ప్రజాసేవకు ఒక అవకాశంగా భావిస్తానని, పేద ప్రజల గొంతుకగా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. హొళగుంద మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి కోసం తనకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.కావున బ్యాలెట్ నమూనాలో క్రమ సంఖ్య 4లో ఉన్న బ్యాటరీ లైట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి ఎల్లార్తి అంజినిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *