రాజంపేట పార్లమెంట్ పరిధిలో కూటమి విజయోత్సవం.. ప్రజా తీర్పుకు శిరసావహనం!
1 min read
మున్సిపల్ ఛైర్మన్లుగా, కౌన్సిలర్లుగా ఎన్నికైన కూటమి అభ్యర్థులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా నవంబర్ 3 (సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో): రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలలో కూటమి తరఫున పోటీ చేసి, ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఛైర్మన్లుగా, కౌన్సిలర్లుగా ఘన విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాలివీడు మండలం జడ్పీటీసీ అభ్యర్థి శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అత్యున్నతమైనది. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తూ, ఎన్నికల్లో సాధించిన విజయాన్ని బాధ్యతగా స్వీకరించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజేతలకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో…రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పరిపాలనలో పారదర్శకత, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు.రాజంపేట పార్లమెంట్ పరిధిలో విజయం సాధించిన కూటమి ఛైర్మన్లు, కౌన్సిలర్లందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు!


