మాంటిస్సోరి స్కూల్ లో లీగల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు”
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి , నవంబర్ 9న జాతీయ న్యాయ సేవ దినోత్సవంను పురస్కరించుకొని ఈ రోజు అనగా 03.11.2026 న కర్నూలు ఏ క్యాంపు నందు గల మాంటిస్సోరి స్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ దినోత్సవ ప్రత్యేకత ను, సైబర్ చట్టాలు గురించి, ఉచిత న్యాయ సేవల గురించి విద్యార్థులకు వివరించారు. నల్సా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పర్యావరణ ఇంజనీర్ కిషోర్ కుమార్ రెడ్డి సేవ్ వాటర్ పై పిల్లలకు అవగాహన కల్పించారు. నీటిని కాపాడక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.అనంతరం స్కూల్ నందు వివిధ న్యాయ సేవల పథకాల గురించి మరియు సేవ్ వాటర్ పై నిర్వహించిన వ్యాసరచన పోటీల మరియు డ్రాయింగ్ పోటీల నందు గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జడ్జి చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ సదస్సులో మాంటిసోరి స్కూల్స్ విద్యా సంస్థల అధినేత రాజశేఖర్, పర్యావరణ ఇంజనీర్ కిషోర్ కుమార్ రెడ్డి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివ రామ చంద్ర రావు,లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి పవన్,టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


