కె.వి.ఆర్ కళాశాల విద్యార్థినీలకు ఆన్ జాబ్ ట్రైనింగ్
1 min read
– నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభం.
కర్నూలు,న్యూస్ నేడు: నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలులోని నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థలో ఈరోజు ఆన్‌జాబ్ ట్రైనింగ్ మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.కేవీఆర్ కళాశాలకు చెందిన ఆఫీస్ అసిస్టెంట్ కోర్సు మరియు అకౌంట్స్ అండ్ టాక్సేషన్ కోర్సుల విద్యార్థులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. ఓజేటి ఇన్స్పెక్షన్ కమిటీ అధ్యాపకులు విజయ్ శేఖర్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు కార్యాలయ నిర్వహణ, కంప్యూటర్ పరిజ్ఞానం, అకౌంటింగ్ విధానాలు మరియు ట్యాక్సేషన్‌కు సంబంధించిన ప్రాయోగిక అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు.ఓజేటి ఇన్స్పెక్షన్ కమిటీ అధ్యాపకులు మల్లికార్జున మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలే కాకుండా వృత్తిపరమైన నైపుణ్యాలు, అనుభవం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాంటి శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.


