ఘనంగా ‘సేవ్ వాటర్’ (నీటి సంరక్షణ) అవగాహన కార్యక్రమం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు గారి ఆదేశాల మేరకు, నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘BRICS Sustainable Lifestyle Week’ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ‘సేవ్ వాటర్ – నీటి సంరక్షణ’ అనే మిషన్ లైఫ్ (Mission LiFE) అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.CSRMO డా. పి. పద్మజ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా నీటి ప్రాముఖ్యత, నీటి వృథాను అరికట్టాల్సిన ఆవశ్యకత, భవిష్యత్ తరాల కోసం నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆసుపత్రి ప్రాంగణంలో ‘సేవ్ వాటర్’ అవగాహన ర్యాలీ నిర్వహించారు.అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలోని కుళాయిలు, నీటి పైప్‌లైన్లను పరిశీలిస్తూ ఎక్కడైనా నీటి లీకేజీలు లేదా వృథా జరుగుతున్నాయా అనే అంశంపై క్యాంపస్ వ్యాప్తంగా ప్లంబింగ్ ఆడిట్ నిర్వహించారు. గుర్తించిన లోపాలను సరిచేసి నీటి వృథాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా పరిశీలన జరిపారు.ఈ కార్యక్రమంలో CSRMO డా పి పద్మజ తో పాటు డిప్యూటీ CSRMO డా వి పద్మజ , వైద్య సిబ్బంది, అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొని నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు.నీటిని పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. నీటిని కాపాడుకుందాం – భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందిద్దాం అనే సందేశంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.


