మదనపల్లె మున్సిపల్ చరిత్రను తిరగ రాసిన చైర్మన్ గా శ్రీరామ్ కుమార్ (చినబాబు) ఘన విజయం
1 min read
మదనపల్లె లో కూటమిదే హవా
అభివృద్ధి నినా దానికి పట్టం కట్టిన ప్రజలు
పార్టీ శ్రేణుల్లో అంబరాన్ని అంటిన సంబరాలు
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మున్సిపాలిటీలో కూటమి పార్టీలు బలపరిచిన తెలుగుదేశం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ కుమార్ ( చిన బాబు ) ప్రతిపక్ష వైయస్సార్సీపి చైర్మన్ అభ్యర్థి జింక వెంకటాచలపతి పై 9 వేల 633 మెజా రిటీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ విజయం కూటమి పార్టీలలో ఆనందో త్సాహాలను నింపింది. అభివృద్ధి నినాదంతో ప్రజల హృదయాలను చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చిన్నబాబు కొల్ల గొట్టారు. మదనపల్లె మున్సి పాలిటీ లో చారిత్రా త్మక విజయాన్ని కూటమి ప్రభుత్వం నమోదు చేసింది. ఈ విజయం ద్వారా ప్రజలు అభివృద్ధికి తమ అండదండలు అందిస్తామని స్పష్టమైన సంకే తాన్ని చెప్పకనే చెప్పారు. శ్రీరామ్ కుమార్ కు మద్దతు గా జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు అండగా నిలిచి, ప్రచారం సాగిం చారు. అలాగే మదనపల్లె శాసన సభ్యులు షాజహాన్ భాష కూడా అభ్యర్థుల విజయం లో కీలక పాత్ర పోషించారు.మదనపల్లె మున్సి పల్ చైర్మన్ పదవికి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరామ్ కుమార్ (చిన బాబు) విజయం కూటమి పార్టీలో నూతన ఉత్సా హాన్ని నింపింది. ఈ విజయం తో మదనపల్లెలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటాయి. కాగా చైర్మన్ అభ్యర్థి రేసులో నిలిచిన టిడిపి అభ్యర్థి శ్రీ రామ్ కుమార్ ( చినబాబు ) 37,832 ఓట్లు సాధించారు. వైఎస్ఆర్సిపి చైర్మన్ అభ్యర్థి జింక వెంకటాచలపతి 28,198 ఓట్లు సాధించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ అప్షర్ షరీఫ్ 1074 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు బాలరాజు 483, కె.మల్లికార్జున 723, గుండ్లపల్లి యోగేశ్వర బాబు 45, టి ఏ పీర్ భాష 679, ఎం సలీం భాష 370, శీలం రమేష్ బాబు 56 కోట్లు సాధించారు. అలాగే రిజెక్టెడ్ ఓట్లు 2,113, నోటా ఓట్లు 365 నమోదయ్యాయి. దింతో మొత్తం ఓట్లు 71 వేల 939 పడ్డాయి. ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగియవడంతో ఇటు పార్టీ శ్రేణుల్లోనూ అటు పుర ప్రజల్లోనూ సంతోషం తో పాటు హర్షాతి రేకాలు వ్యక్తం అయ్యాయి.ఎన్నికల్లో చైర్మన్ గా విజయం సాధించిన శ్రీ రామ్ చిన బాబు ను అనంతరం జిల్లా ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి పార్టీ నేతలు పుష్పగొచ్చాల అందించే దుశాలలతో ఘనంగా సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.



