NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మదనపల్లె మున్సి పాలిటీ లో కూటమి పార్టీల అభ్యర్థులకె స్పష్టమైన మెజారిటీ

1 min read

టిడిపికి 22, జనసేన కు 6, బిజెపికి 4, బీఎస్పీకి 1, స్వతంత్రులు 3, వైసిపి 12 స్థానాల్లో విజయం 

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మున్సిపాలిటీ లో  కూటమి పార్టీలు విజయ దుందభి మ్రోగించాయి. మదనపల్లె మున్సిపాలిటీలో 48 వార్డు లు ఉండగా అందులో  టీడీపీ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) కూటమి – 32 వార్డుల్లో విజయం సాధించారు. అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి 12 స్థానాలకే సరిపెట్టు కోవాల్సి వచ్చింది. కాగా బీఎస్పీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించి ఖాతా తెరిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలుపొందారు. టీడీపీ గెలచిన (22 వార్డులు) అభ్యర్థులు వివ రాలు వార్డుల వారీగా ఇలా వున్నాయి. ఇందులో 3 వార్డు లో రాగినేని కవిత, 4వ వార్డు – బండి పవన్, 7 వ వార్డు బండి రమణప్ప,8 వ వార్డు – ప్రమీల, 10 వ వార్డు శ్రీరామ సహదేవనాయుడు,13 వ వార్డు బాబు నాయుడు, 20 వ వార్డు నస్రిన్  తాజ్,  23 వ వార్డు లో రానా చౌదరి, 24 వ వార్డు లో పూల కుంట్ల వాణి, 26వ వార్డు లో ముస్తాక్ అహమ్మద్,28 వార్డు ఏకగ్రీవం పచ్చి పాల రామకృష్ణ,33 వ వార్డులో రవి నాయక్,34 వ వార్డులో రంగ స్వామి నాయుడు,37 వ వార్డులో శేషా చలపతి నాయుడు, 38వ వార్డులో రజియా బేగం,39వ వార్డు లో వెంకటరమణ,40వ వార్డులో శివకుమారి,41వ వార్డులో నాగార్జున బాబు, 43వ వార్డులో రమణయ్య,46వ వార్డులో స్వాతి, 47వ వార్డులో రెడ్డి కేశవులు, 48 వ వార్డు లో కొరముట్ల నాగరాజు లు గెలుపొందారు. జనసేన పార్టీ  (6 వార్డులు) విజయం సాధించగా అందులో  2వ వార్డులో కళావతి, 5వ వార్డు లో చామంచల మల్లికా,9వ వార్డులో సుజాత,14వ వార్డులో లక్ష్మి దీపిక, 42వ వార్డులో గాయత్రి, 44వ వార్డులో బండి భారతి లు విజయం సాధించారు.బీజేపీ (4 వార్డులు) లో గెలిచిన వారి వివరాలు ఇలా వున్నాయి.11వ వార్డు లో విజయశ్రీ,12 వ వార్డు లో ఎల్లంపల్లి ప్రశాంత్, 35వ వార్డులో  విద్యాధరి,45వ వార్డులో బి.సుశీల లు గెలిచారు. అలాగె వైసీపీ గెలిచిన (12 వార్డులు) 1వ వార్డులో నాగరాజు, 6వ వార్డులో నీలోఫర్, 16వ వార్డులో సుగుణ,17వ వార్డులో లావణ్య,18వ వార్డులో జింక రాధమ్మ, 19వ వార్డులో ఫర్జానా రఫీ,25వ వార్డులో షమీమ్ అస్లాం,27వ వార్డులో తౌఫిక్ అహమ్మద్,29వ వార్డులో షర్మిలా భాను,30 వ వార్డులో నగీనా, 31వ వార్డులో గిరిజ,36వ వార్డులో లియాఖత్ ఆలీ లు వున్నారు. అదే విధంగా స్వతంత్రులుగా 15వ వార్డులో ఎస్ ఎల్ వి రఘు,21వ వార్డులో బర్నేపల్లి రవి కుమార్, 22వ వార్డులో సుజాతలు విజయం సాధించారు.బీఎస్పీ పార్టీ నుండి 32వ వార్డులో అరుణ్ కుమార్ గెలిచారు. మొత్తం 48  కౌన్సిలర్ స్థానాలకు గాను 48 వార్డులు ఫలితాలు వెలు వడగా  కూటమి పార్టీ లు కౌన్సిల్ లో స్పష్టమైన మెజారిటీ సాధించాయి. ఫలితాలు వెలు వడిన వెంటనే కూటమి పార్టీల శ్రేణులు సంబరాల్లో మునిగాయి. గెలు పొందిన అభ్యర్థుల కు ఘనంగా సన్మానిస్తూ శుభా కాంక్షలు తెలిపారు. కూటమి అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడం వల్ల మదన పల్లె మున్సి పాలిటీ రూపు రేఖలు మారడంతో పాటు అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఉంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *