NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిప్పగిరిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

1 min read

ఐదేళ్ల జగనన్న పాలనలో చేసిన మంచిని గుర్తు చేసుకోండి.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి

జడ్పీటీసీ అభ్యర్థి ఉనేబది జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థులు చెరువు మహానంది, కొలిమి సర్వర్ ఖాన్‌లను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి

ప్రజల గొంతుకై.. ప్రజాస్వామ్య పరిరక్షణకై వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొని వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు.ఓటు వేసే ముందు గత ఐదేళ్లలో జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బేరీజు వేసుకోవాలని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు.చిప్పగిరి మండల జడ్పీటీసీ అభ్యర్థి ఉనేబది జ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థులు చెరువు మహానంది, కొలిమి సర్వర్ ఖాన్‌లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధుల ఎంపికలో ఓటర్లు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జూటూరు మారయ్య, చిప్పగిరి మండల కన్వీనర్ ఉనేబది మల్లికార్జున, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, బుసినే విరుపాక్షి అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *