NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మున్సిపల్ చైర్మన్..వైసీపీ హ్యాట్రిక్

1 min read

షేక్ ఫాతిమాభీ 2,634 ఓట్ల ఆదిక్యంతో గెలుపు

నందికొట్కూర్ పట్టణంలో వైసీపీ హవా

వైసీపీ-23..టీడీపీ-9 వార్డుల్లో కౌన్సిలర్ల గెలుపు..

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,డాక్టర్ సుధీర్ శ్రమకు గిఫ్ట్

వైసీపీ నేతల సంబరాలు..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపా పార్టీ హ్యాట్రిక్ సాధించింది.1వ తేదీ జరిగిన మున్సిపల్ ఎన్నికలు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.కౌంటింగ్ ప్రారంభమైన మొదటి నుండి వార్డుల్లో వైసిపి మెజార్టీ పెరుగుతూనే హవా కొనసాగింది.మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా వైసీపీ నుండి షేక్ ఫాతిమాభీ,టిడీపీ నుండి సాబేరున్నిసా పోటీలో నిలబడ్డారు.టిడిపి అభ్యర్థి సాబేరున్నిసాపై ఫాతిమాభీ-2,634 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.పట్టణంలో 32 వార్డులు ఉండగా వీటిలో వైకాపా పార్టీ-23..తెదేపా-9 వార్డుల్లో అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు.

గెలుపొందిన కౌన్సిలర్ల వివరాలు

1వ వార్డు:

కే శివకృష్ణ టిడిపి,

2 వ వార్డు:

బొల్లెద్దుల రాధ వైసీపీ,3వ

ఎస్ సుమలత టీడీపీ,4 రవికుమార్ వైసీపీ,5 పింజరి శాలిబి,6 బి దిల్షాద్ వైసీపీ, 7 మహబూబ్ బాష వైసీపీ 8 ఎం సాములు వైసిపి,9 జరపాటి లక్ష్మీదేవి టీడీపీ, 10 షేక్ బాష వైసీపీ,11 షేక్ నాయబ్ వైసీపీ,12 షేక్షావలి టీడీపీ,13 ఎం అబ్దుల్లా వైసీపీ,14 షబాన వైసీపీ, 15 సి సరస్వతి వైసీపీ,16వ దొడ్డ వరలక్ష్మి వైసీపీ,17 పల్లె ప్రమీల వైసీపీ,18 భార్గవ తేజ వైసీపీ,19 బొగ్గుల భాగ్యలక్ష్మి వైసీపీ,20 ప్రదీప్ కుమార్ వైసీపీ,21 మొల్ల సమీరా భాను వైసీపీ,22 సి సరితమ్మ వైసీపీ,

23 చింతా శశికళ వైసీపీ, 24 అబ్దుల్ రవూఫ్ వైసీపీ, 25 ఉస్మాన్ భాష వైసీపీ, 26 సునీత కుమారి వైసీపీ, 27 ఈఎం సురేంద్ర టీడీపీ,28 టి సుజాత వైసీపీ,29 భాస్కర్ రెడ్డి టీడీపీ,జి విజయలక్ష్మి టీడీపీ,31 చంద్రమోహన్ రెడ్డి టీడీపీ,32 మహేశ్వరమ్మ వైసీపీ వీరందరూ కౌన్సిలర్లుగా గెలుపొందారు.వీరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గెలుపొందినట్లుగా డిక్లరేషన్ ఫారాలను కౌన్సిలర్లకు అందజేశారు.

సిద్ధార్థ రెడ్డి..డాక్టర్ సుధీర్ శ్రమకు విజయం గిఫ్ట్

నందికొట్కూర్ ఎన్నిక రికార్డ్ సృష్టించడంతో ఎన్నికలకు ముందుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,డాక్టర్ సుధీర్ ఆచరణ కార్యచరణ సలహాలతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నామని కౌన్సిలర్లు అంటున్నారు. వారి శ్రమకు తగిన విధంగా చైర్మన్ పీఠం సిద్ధార్థ రెడ్డికి బహుమతిగా ఇస్తున్నామని వారు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *