NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సమీక్ష

1 min read

నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి  : అన్నమయ్య జిల్లాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళ వారం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో మదనపల్లి కలెక్టరేట్ నుంచి వీసీ సమావేశం నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే పురోగతి లో ఉన్న పనుల ప్రస్తుత స్థితిని, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాల పురోగతిని అధికారులను అడిగి తెలుసు కున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఆవాసాలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల  నిర్మాణాలను మార్చి 2027 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకో వాలని సూచించారు.అలాగే, ఇంకా ప్రారంభం కాని జిఎల్బీఆర్ లు, ఓహెచ్బిఆర్ లు, క్లియర్ వాటర్ సంపుల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, వాటి పురోగతికి సంబంధించి స్పష్ట మైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఆయా పనుల ప్రారంభం, పూర్తి చేయాల్సిన గడువులతో కూడిన షెడ్యూల్‌ను నవంబర్ 10, 2026లోపు సమర్పించాలని స్పష్టం చేశారు.వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకు స్థానికంగా తాగు నీటి సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు, ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేయాల్సిన అవసరం తగ్గి నిర్వహణ వ్యయంపై భారం తగ్గుతుందని పేర్కొన్నారు.ప్రాజెక్టు పనుల అమలులో వివిధ శాఖల మధ్య సమన్వయానికి సంబంధించిన అంశాలను కూడా కలెక్టర్ సమీక్షించారు. అవసరమైన అనుమతులు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించుకుని, పనుల అమలులో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డి ఆర్ ఈ ఓ  కే. శ్రీధర్, రాయచోటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్  శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *