సీక్రైట్ నోవా: చిన్న వ్యాపారాలకు డేటా గోప్యతలో కొత్త భరోసా
1 min read
హైదరాబాద్, న్యూస్ నేడు: భారతదేశంలో డిజిటల్ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, డేటా గోప్యత, భద్రత సంస్థలకు కీలక సవాళ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్ట నిబంధనలను పాటించేందుకు అవసరమైన సాంకేతికత, నిపుణుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ సమస్యలకు పరిష్కారంగా క్విక్ హీల్ టెక్నాలజీస్ తన ఎంటర్‌ప్రైజ్ సైబర్ సెక్యూరిటీ బ్రాండ్ సీక్రైట్ ద్వారా ‘సీక్రైట్ నోవా’ అనే ఏఐ ఆధారిత డేటా ప్రైవసీ సేవను పరిచయం చేసింది. ఈ సరికొత్త ప్లాట్‌ఫామ్ SOHO, SMB, మధ్య తరహా సంస్థలకు కొద్ది రోజుల్లోనే డీపీడీపీ నిబంధనల పాటింపు ప్రక్రియను ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తుంది.లైట్, ఎసెన్షియల్స్, ప్రొఫెషనల్ అనే మూడు వెర్షన్లలో అందుబాటులో ఉండే నోవా, సంస్థల అవసరాలకు అనుగుణంగా సేవలను అందిస్తుంది. ఎండ్‌పాయింట్లు, క్లౌడ్ అప్లికేషన్లు, డేటాబేస్‌లు, ఫైళ్లలోని వ్యక్తిగత సమాచారాన్ని ఏఐ సాయంతో గుర్తించి వర్గీకరిస్తుంది. అంతేకాకుండా, గోప్యతా నోటీసులు, సమ్మతి ప్రక్రియలను 22 భారతీయ భాషల్లోకి అనువదిస్తుంది.క్విక్ హీల్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరీష్ కుమార్ జీఎస్ మాట్లాడుతూ, “పెరుగుతున్న వ్యాపారాలకు భారతదేశ డీపీడీపీ నిబంధనలను పాటించడం సంక్లిష్టమైన, అధిక వనరులు అవసరమయ్యే ప్రక్రియ కాకూడదు. సీక్రైట్ నోవా ద్వారా ఎంటర్‌ప్రైజ్ స్థాయి ప్రైవసీ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి వ్యాపారం తన అవసరాలకు, వృద్ధి దశకు అనుగుణంగా ఏఐ ఆధారిత పరిష్కారంతో డేటా గోప్యతను బలోపేతం చేసుకోవచ్చు” అని తెలిపారు.డేటా లీకేజీ నివారణ, కస్టమర్ సమ్మతి నిర్వహణ, డేటా తొలగింపు అభ్యర్థనలు, భద్రతా ఉల్లంఘనలపై స్పందన వంటి సదుపాయాలతో సీక్రైట్ నోవా వ్యాపారాలకు మరింత భరోసానిస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ మానవ ప్రమేయంతో డేటా గోప్యతను బలోపేతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.


