NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత

1 min read

పోలీసులు టీడీపీ నాయకుల మధ్య తోపులాట

కౌంటింగ్ ను పరిశీలించిన కలెక్టర్

కౌంటింగ్ నిలిపివేయటంపై సిద్ధార్థ రెడ్డి రోడ్డుపై బైఠాయింపు…

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగు జరుగుతున్న మున్సిపాలిటీ కౌంటింగ్ పోలీసులు మరియు టిడిపి నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మధ్యాహ్నం నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఎన్నికల లెక్కింపు జరుగుతున్న గదులను పరిశీలించారు. ఆ తర్వాత రెండు గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ ను రికౌంటింగ్ చేయాలని టిడిపి నాయకులు పట్టు పట్టడంతో కౌంటింగ్ వద్ద ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్, ఆత్మకూరు సిఐ సురేష్ కుమార్ రెడ్డి,పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి సిబ్బంది మధ్య తీవ్ర తోపులాట జరిగింది.రెండు గంటల పాటు అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు.

రోడ్డుపై బైఠాయించిన బైరెడ్డి,డాక్టర్ సుధీర్,బుడ్డా

కౌంటింగ్ నిలిపివేయడాన్ని తెలుసుకున్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,డాక్టర్ సుధీర్, ఆత్మకూరు బుడ్డా శేషారెడ్డి మిడుతూరు- నందికొట్కూరు రహదారిలో డిగ్రీ కాలేజ్ దగ్గర ప్రధాన రోడ్డుపై భారీగా చేరుకున్న కార్యకర్తలతో పాటు రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపారు.సిద్ధార్థ రెడ్డి కార్యకర్తలు కౌంటింగ్ వద్దకు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సిద్ధార్థ రెడ్డికి సర్ది చెప్పారు.కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత వారు వెళ్ళారు.

కార్యాలయం వద్ద నేతల హంగామా

చైర్మన్ పీఠం వైసీపీ చేజెక్కించుకోవడంపై

పట్టణంలో వైసీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి హంగామా సంబరాలు చేసుకున్నారు.గెలుపొందిన అభ్యర్థులు సిద్ధార్థ రెడ్డి మరియు డాక్టర్ సుధీర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *