PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోనెగండ్లలో భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల: మండలకేంద్రమైన గోనెగండ్లలో భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా మసీదు ముల్లాభాష మాట్లాడుతూ అసైదులా హారతి.. కాళ్ల గజ్జల ఇమ్మతి అంటూ ధూంధాంగా హిందూ, ముస్లింలు సోదరభావంతో జరిపే పండుగ మొహర్రం అని, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకను పీర్లపండుగ అంటారని, పీరు అంటే ఆధ్యాత్మిక గురువు అని అర్థం అని,షియా తెగవాళ్లు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకునే వారని, ఇస్లాం దైవప్రవక్త మహ్మద్ మనమలైన హసన్, హుస్సేన్లు.. కర్బలా యుద్ధంలో చేసిన వీరోచిత ప్రాణత్యాగానికి గుర్తుగా పీరుల్ని ఊరేగిస్తూ వారం పాటు జరపుకుంటారని తెలిపారు. నేటి తో మొహర్రం వేడుకలు ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.


About Author