NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఎస్​జీహెచ్’ మహిళలకు రుణాలిచ్చి… జీవనోపాధి కల్పించండి

1 min read

– అధికారులను ఆదేశించిన జేసీ(సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జిల్లాలోని ఎస్​జీహెచ్​ గ్రూపుల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలని, అందుకు బ్యాంక్​ లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించి జీవనోపాధి కల్పించాలని ఆదేశించారు జాయింట్​ కలెక్టర్​ (సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు. శనివారం తన ఛాంబరులో డీఆర్​డీఏ పీడీ వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ శిరీష, గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ LDM వెంకటనారాయణతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ .. యస్ జి హెచ్ గ్రూపుల మహిళలు జగనన్న చేయూత ద్వారా అభివృద్ధి పథంలో నడిచేలా చూడాలని, వారికి క్షేత్రస్థాయిలో మీటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిరు వ్యాపారం చేస్తున్న మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. అదేవిధంగా జగనన్న గృహాలలో లబ్ధిదారులుగా వున్న యస్ జి హెచ్ గ్రూపుల మహిళలు త్వరితగతిన గృహాలు నిర్మించుకునేలా చూడాలని, క్షేత్రస్థాయిలో గృహాలు మంజూరైనవారు వెంటనే నిర్మించుకునేలా చైతన్య పరచాలన్నారు. జిల్లాల్లో జగనన్న గృహాలలోని లబ్దిదారుల్లో దాదాపు 43శాతం పొదుపు గ్రూపు మహిళలు ఉన్నారని, వీరందరూ త్వరితగతిన గృహాలు నిర్మించుకునేలా చూడవలసిన భాద్యత సంబంధిత అధికారుల పై ఉందని సమీక్షలో జాయింట్​ కలెక్టర్​ ( ఆసరా మరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

About Author