NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టణంలో కలియ తిరిగిన ఎంపీ శబరి

1 min read

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎంపీ..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం ఉదయం ఆత్మకూరు రహదారిలో జమ్మి చెట్టు వద్ద శివాలయం దేవాలయానికి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి భూమి పూజ చేశారు. తర్వాత సుంకులమ్మ దేవాలయం,కోట వీధి ఆంజనేయ స్వామి దేవాలయం, సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముందుగా ఎంపీ బైరెడ్డి చివరికి నూతన కౌన్సిలర్లు

29వ వార్డు కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి,30 వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి మరియు మహిళలు

మేళ తాలాల నడుమ ఘన స్వాగతం పలికారు.పూజల అనంతరం భాస్కర్ రెడ్డి మరియు కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి ఎంపీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.తర్వాత ఎంపీ పాత్రికేయులతో మాట్లాడుతూ ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని మేము ఎవరికీ తల దించే ప్రసక్తే లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారని కొన్ని పొరపాట్ల వల్ల ఈ మధ్య జరిగిన నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ఓటమి కావడం జరిగిందని ఓటమికి గల కారణాలు సరిచేసుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,పల్లె రఘునాథ్ రెడ్డి,బంగారు వెంకటేశ్వర్లు,మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు, పోతులపాడు శివానందరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *