ఆపదలో ఉన్న పాత్రికేయుడికి అండగా మున్సిపల్ చైర్మన్
1 min read
రూ.30 వేల ఆర్థిక సాయం అందించిన శ్రీరామ్ చిన బాబు
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి : ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజ మైన మానవత్వ మని మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చిన బాబు) చాటి చెప్పారు. కొన్ని రోజుల క్రితం ప్రమాదం లో ఒక కాలును కోల్పోయి, చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న హాన్స్ ఇండియా దినపత్రిక సీనియర్ పాత్రికేయుడు యుగంధర్ (చిన్న) పరిస్థితిని తెలుసు కున్న మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు స్పందించారు. ఆయనకు ఫోన్‌పే ద్వారా రూ.30 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి తన మానవతా దృక్ప థాన్ని చాటు కున్నారు.కష్టకాలంలో తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థికంగా అండగా నిలిచిన చినబాబు కు పాత్రికేయుడు యుగంధర్ కృతజ్ఞ తలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సాయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటాల కు దూరంగా, ఆపదలో ఉన్న వారికి తనవంతు సహాయం అందించడం అభినంద నీయ మని పలువురు మిత్రులు పేర్కొ న్నారు. సాయం విలువ ఎంత అన్నది ముఖ్యం కాదని, కష్టకాలంలో ఆప్యాయతతో అందించే ఆపన్న హస్తమే ఎంతో విలువైనదని వారు అభిప్రాయ పడ్డారు.


