పత్తికొండలో ఒక్క అవకాశం ఇస్తే అసలైన మార్పు చూపిస్తా..
1 min read
పత్తికొండ సర్పంచ్ బరిలో సురేంద్ర బాబు
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా ఒక్కసారి అవకాశం ఇస్తే అసలైన మార్పు చేసి చూపిస్తా అని పత్తికొండ గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలోకి దిగుతున్న యువకుడు సామాజిక సేవ తత్పరుడు యు సురేంద్ర బాబు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక పత్తికొండ తేరుబజార్ లో పత్తికొండ సర్పంచ్ బరిలోకి దిగుతున్నట్లు కురువ సురేంద్ర బాబు పత్రికా ముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా పేరు బజారులో అందరితో కలియ తిరుగుతూ, ప్రచారాన్ని ప్రారంభించారు. పత్తికొండ గడ్డపై పుట్టి పెరిగిన ఒక సాధారణ రైతు కూలీ బిడ్డగా, ఈ ప్రాంత ప్రజల కష్టాలను దగ్గరనుండి చూసిన అనుభవంతో తాను మీ ముందుకు వస్తున్నాని అన్నారు.నా జీవిత ప్రయాణం కేవలం ఉద్యోగాలకే పరిమితం కాలేదు. ఒక దినసరి కూలీగా, రిపోర్టర్‌గా, పత్తికొండ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా, దేశంలోనే ప్రముఖమైన అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్‌లో దశాబ్ద కాలం పాటు సేవలందిస్తూ.. ఆదిలాబాద్‌తో పాటు సుమారు 11 జిల్లాలలో స్వశోధన్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటర్‌గా, ఒక కార్పొరేట్ కంపెనీలో మేనేజర్‌గా అనేక బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు. అసలు నేను ఏంటో నా సేవలు ఎలాంటివి అనేది పత్తికొండ ప్రజలకే బాగా తెలుసు. ఇన్ని రంగాలలో నేను సంపాదించిన అనుభవం, పరిపాలనా దక్షతను మన సొంత ఊరికి, మన పత్తికొండ అభివృద్ధికి ఉపయోగించాలనేదే తన అభిమతమని చెప్పారు.డబ్బుతో ఓట్లను కొనే రోజులు మనం చూస్తున్నాం. కానీ, అలాంటి రాజకీయాలకు భిన్నంగా ఎలాంటి డబ్బు ఆశించకుండా, కేవలం ప్రజలకు మంచి చేయాలనే తపనతో తాను సర్పంచ్ గ పోటీ చేస్తున్నానని తెలిపారు.


