NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ ఆదాయ వసూళ్ల లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ

1 min read

బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

అక్రమ మైనింగ్, పన్నుల ఎగవేత పై కఠిన చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి : జిల్లాలో ప్రభుత్వ ఆదాయ వసూళ్లను మెరుగుపరిచి, 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా అన్ని ఆదాయార్జన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని నీతి హాలులో నిర్వ హించిన ఆదాయార్జన శాఖల సమీక్ష సమావేశంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్సెస్, రవాణా, గనులు, మున్సిపల్, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖల ఆదాయ లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన వసూళ్లు, బకాయిల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. పన్నులు, ఇతర ప్రభుత్వ ఆదా యాలను పూర్తి స్థాయిలో వసూలు చేయడంతో పాటు పెండింగ్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.ప్రతి శాఖ అధి కారులు లక్ష్యాల సాధనకు ప్రణాళికా బద్ధంగా పని చేయాలని, వసూళ్లలో పార దర్శకత, జవాబు దారీతనం పాటిస్తూ పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *