బాల్య వివాహాల నిర్మూలన .. పోక్సో చట్టంపై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బి.లీలా వెంకట శేషాద్రి గారి ఆదేశాల మేరకు, బాల్య వివాహాల నిర్మూలన మరియు బాలలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని కర్నూలులోని నైస్ యూత్ ఫర్ కల్చర్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ, నైస్ యూత్ ఫర్ కల్చర్ ఎడ్యుకేషన్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, కె.వి.ఆర్ కళాశాల మరియు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 117 సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్రమైన నేరమని, ప్రతి ఒక్కరూ బాలల హక్కులను గౌరవించి వారి రక్షణకు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యా విద్యార్థిని విద్యార్థులు మరియు కళాశాల విద్యార్థులచే బాల్య వివాహాల నిరోధం అమలు మరియు పోక్సో ఆక్ట్ పైన ప్రతిజ్ఞ చేయించారు.


