చిరంజీవికి ‘మెగాస్టార్ ’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : కొణెదల శివ శంకర వర ప్రసాద్. వెండితెర పై తన బ్రేక్ డాన్స్ తో కొత్త చరిత్ర సృష్టించాడు. తన నటనతో అభిమానుల గుండెల్లో చిరంజీవిగా నిలిచాడు. శివశంకర వరప్రసాద్ .. చిరంజీవిగా మారారు. తనదైన నటనతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. సుప్రీం హీరోగా ప్రేక్షకుల మనసుల్ని గెలిచాడు. ఆ సుప్రీం హీరో.. మెగాస్టార్ గా అవతరించాడు. చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరిచ్చారనే విషయం చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత కె.ఎస్. రామారావు కలయికలో వచ్చిన నాలుగో చిత్రం మరణమృదంగం
. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా ఈ సినిమాను కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం టైటిల్ తోనే మెగాస్టార్ అనే బిరుదు తెరమీద పడింది. అప్పటి వరకు సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి.. కే.ఎస్. రామారావు చిత్రం ‘ మరణమృదంగం’ తో మెగాస్టార్
గా మారారు. మెగాస్టార్ బిరుదు చిరంజీవికి ఇచ్చింది కె.ఎస్. రామారావే.