లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కదులుతున్నాయి. ఉదయం భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే ఆరంభ లాభాలు ఆవిరి అయిపోయాయి. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం సూచీలు స్వల్ప లాభంతో కన్సాలిడేట్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఆసియా, అమెరికా, యూరోపియన్ సూచీలు కూడ పాజిటివ్ గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు అంతర్జాతీయ సూచీలను అనుసరించాయి. మధ్యాహ్నం 2:30 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 286 పాయింట్ల లాభంతో 55,606 స్థాయి వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 16,514 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 109 పాయింట్ల స్వల్ప లాభంతో 35144 స్థాయి వద్ద కదులుతోంది.