రాయచోటిలో పందుల స్వైర విహారం
1 min read– పట్టించుకోని అధికారులు
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: రాయచోటి పట్టణంలో పందులు స్వైరవిహారం చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో కరోన కేసులు పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో ప్రజలు భయాందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పందులు వీధులలో స్వైర విహారం చేస్తుండటంతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పాతరాయ ఛోటి, రామాపురం, దూదేకులపల్లి, లక్ష్మీ పురం తదితర ప్రాంతాల్లో పందులు సంచరిస్తుండటంతో .. దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు . ఇలాగే కొనసాగితే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు విజృంభించే అవకాశాలు లేకపోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి పందులను పట్టణంలో లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.