సంబేపల్లి హైస్కూల్ లో ఆంధ్రా కేసరి జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలో ని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం ఉదయం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిషు వారి తుపాకికెదురుగా తన గుండె నుంచి ఆంధ్రకేసరి అని బిరుదు పొందారన్నారు. సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు అయిన ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. ఆయన దేశభక్తి, నిస్వార్థ సేవ నేటి ప్రజలందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఆయన జయంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.