కరెంటు ఆదా చేస్తే..డబ్బులు ఇస్తున్నారు !
1 min readపల్లెవెలుగు వెబ్ : పంజాబ్ ప్రభుత్వం వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆరు గ్రామీణ ఫీడర్ల పరిధిలో పైలెట్ ప్రాజెక్టుగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ ఫీడర్ల పరిధిలోని పంపుసెట్లకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ యూనిట్ ను బిగించింది. పంపు సెట్ల సామర్థ్యం, పంటసాగుకు అవసరమయ్యే నీటి పరిమాణాన్ని లెక్కించి.. ఒక నెలలో అవసరమయ్యే సగటు విద్యుత్ పరిమాణాన్ని లెక్కించింది. ఈ నిర్దేశిత పరిమాణం కన్నా తక్కువ విద్యుత్ వినియోగిస్తే.. ఆదా చేసిన ఒక్కో యూనిట్ కు ప్రోత్సాహకంగా నాలుగు రూపాయలను రైతులకు ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం ద్వార నాలుగు వేల మంది రైతులు విద్యుత్ ఆదా చేసి 38 లక్షలు ప్రోత్సాహకంగా పొందారు. నిర్దేశించిన పరిమాణం కన్నా ఎక్కువ విద్యుత్ వాడినా రైతుల పై ఎలాంటి చర్యలు ఉండవని అధికారులు తెలిపారు.