వాట్సాప్ లో వ్యాక్సిన్.. ఇలా బుక్ చేసుకోండి
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోన మూడోదశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ బుకింగ్ కోసం నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వాట్సాప్ లో కూడ వ్యాక్సిన్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మండవీయ ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటించారు.
ఇలా బుక్ చేసుకోండి :
- ముందుగా mygovindia corona helpdesk నెంబర్ 91-9013151515 మీ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఈ నెంబర్ కు బుక్ స్లాట్ అని మెసేజ్ పంపాలి.
- అప్పుడ మీ ఫోన్ నెంబర్ కు ఆరు అంకెల ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేసి నెంబర్ వెరిఫై చేయాలి.
- ఆ తర్వాత తేది, లొకేషన్, పిన్ కోడ్, వ్యాక్సిన్ టైప్ తదితర వివరాలు నింపాలి.
- అన్నీ పూర్తయ్యాక కన్ఫర్మ్ చేస్తే మీకు స్లాట్ బుక్ అవుతుంది.