అగ్రిగోల్డ్.. బాధితుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
1 min readపల్లెవెలుగు వెబ్ : రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ నగదును జమ చేశారు. 10 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు 207.61 కోట్లు, 20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు 459.23 కోట్ల నగదు చెల్లింపు చేశారు. 7లక్షలకు పైగా అగ్రిగోల్డ్ బాధితులకు 666.84 కోట్లు ఏపీ ప్రభుత్వం ఖాతాల్లోకి నగదు జమ చేసింది. అగ్రిగోల్డ్ డబ్బంతా కష్టజీవులదేనని, ఆ సొమ్మును కాజేయాలని చూశారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ మోసం చేస్తే ఆ డబ్బును ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేసే ప్రయత్నం కూడ జరిగిందని అన్నారు.