లాభాల్లో సూచీలు.. లీడ్ చేసిన ఫార్మా, బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ సూచీలు లాభాల్లో ముగిసాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడటంతో.. అదే బాటలో ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు కూడ పయనించాయి. ప్రధానంగా ఫార్మా, బ్యాంకింగ్, మెటల్ స్టాక్ ఈ సెషన్ ని లీడ్ చేశాయని చెప్పవచ్చు. సెన్సెక్స్ 403 పాయింట్ల లాభంతో 55,958 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 16,624 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 587 పాయింట్ల లాభంతో 35,712 వద్ద క్లోజ్ అయింది.