NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేయ‌ర్ అభ్యర్థిగా సోనూసూద్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : 2022లో జ‌రిగే ముంబై కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్యర్థిగా రియ‌ల్ హీరో సోనూసూద్ పోటీ చేయ‌బోతున్నార‌న్న వార్తలు చ‌క్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ మేయ‌ర్ అభ్యర్థిగా సోనూసూద్ ను ప్రక‌టించ‌నుంద‌న్న ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి గ‌ట్టిపోటీ ఇచ్చేందుకు సెలెబ్రటీల‌ను రంగంలోకి దించాల‌ని భావిస్తోంద‌ని, ఈ నేప‌థ్యంలోనే సోనూసూద్, రితేష్ దేశ్ ముఖ్ , మిలింద్ సోమ‌న్ పేర్లను తెర‌పైకి తెస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. వీరిలో సోనూసూద్ పేరు ఖ‌రారు చేయ‌నుంద‌న్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై సోనూసూద్ స్పందించారు. మేయ‌ర్ అభ్యర్థినంటూ వ‌స్తున్న వార్తలు అవాస్తవ‌మ‌ని సోనూ చెప్పారు. సామాన్యుడిగా చాలా ఆనందంగా ఉన్నాన‌ని తెలిపారు.

About Author