87 రూపాయలకే సొంత ఇళ్లు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇటలీలో పల్లెలు వలసపోతున్నాయి. పల్లెలు పట్టణాలకు పరుగు పెడుతున్నాయి. దీంతో పల్లెలు గత చరిత్రకు సాక్ష్యంగా.. నిర్మానుష్యంగా.. ఏ దిక్కూ లేని అనాథలా బోసిపోతున్నాయి. పల్లెలకు జీవం పోసేందుకు ఇటలీ ప్రభుత్వ ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి సమీపంలో మాయోంజా అనే చిన్న పట్టణం ఇప్పుడు ఖాళీ అయింది. దీంతో ఈ పట్టణానికి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అక్కడ ఇళ్లు కొనుక్కునాలనుకునే వారికి 87 రూపాయలకే ఇంటిని అమ్ముతుంది. విడతల వారీగా… ఇంటి యజమానుల సమ్మతితో ఇళ్లను విక్రయిస్తున్నారు. ఇళ్లు కొనేవారు తప్పనిసరిగా మూడేళ్లలో మరమ్మత్తులు చేయించుకోవాలి. ఇంటిని పునరుద్దరించేందుకు 5000 యూరోలు ముందస్తుగా డిపాజిట్ చేయాలి. కొన్నవారు ఖచ్చితంగా అక్కడ నివాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఇంటిని ఎందుకు వినియోగిస్తారో మాత్రం ఖచ్చితంగా చెప్పాలి.