ఆప్ఘన్ మాజీ మంత్రి.. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్ గా … !
1 min readపల్లెవెలుగు వెబ్ : చిన్నపాటి రాజకీయ పదవులొస్తేనే తరాలకు సరిపడా డబ్బు సంపాదించాలని రాజకీయనేతలు ప్రయత్నిస్తారు. పదవి ఉన్నా లేకున్నా.. వైట్ అండ్ వైట్ ఖద్దరు మాత్రం తగ్గరు. హోదాకు ఏ మాత్రం ఢోకా లేకుండా బతుకుతారు. కానీ ఆప్ఘనిస్థాన్ మాజీ మంత్రి ఇప్పడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. ఇది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇది నిజం. 2018-20 మధ్య ఆప్ఘన్ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘనీ ప్రభుత్వంలో సయూద్ అహ్మద్ షా సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా పని చేశారు. అష్రాఫ్ తో విభేదాలు తలెత్తడంతో సయూద్ అహ్మద్ షా పదవికి రాజీనామా చేసి.. జర్మనీ వెళ్లిపోయారు. అక్కడ లివాండ్రో అనే కంపెనీలో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ విషయం అల్ జజీరా అరేబియా వార్తా సంస్థ ఫోటోలతో సహా ట్విట్టర్ లో ప్రచురించింది. సయూద్ ఆక్స్ ఫర్డ్ నుంచి కమ్యూనికేషన్స్ , ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశారు. లండన్ లోని అరియానా టెలికాం కంపెనీకి 2016-17 మధ్య సీఈవో గా పనిచేశారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోవడంతో లివాండ్రో అనే పిజ్జా డెలివరీ కంపెనీలో పనిచేస్తున్నట్టు సయూద్ స్పష్టం చేశారు.