వాలంటీర్లు అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : గ్రామ వాలంటీరు వ్యవస్థ పై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆశయాన్ని వాలంటీర్లు వమ్ము చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను తొలగించామని, గ్రామసచివాలయాల్లోని 10 మంది ఉద్యోగులకు మెమోలు జారీ చేశామని తెలిపారు. వాలంటీర్లు పథకాల అమల్లో అవినీతికి పాల్పడితే ఊరుకోమని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వాలంటీర్ వ్యవస్థ పై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.