విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.. ఇలా పెట్టుబడులు పెట్టండి
1 min readపల్లెలుగు వెబ్ : విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రాబోతోంది. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ సెప్టంబర్ 1న ప్రారంభమై.. 3న ముగుస్తుంది. ఐపీవో ధర రేంజ్ 522 నుంచి 531 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఇష్యూ ద్వార 1,895 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులు తమ వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వార విక్రయించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీకు 80 డయాగ్నోస్టిక్ కేంద్రాలు, 11 ల్యాబ్ లు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, 13 నగరాలు, పట్టణాల్లో ఈ సంస్థ తన సేవలు అందిస్తోంది. ఈ ఐపీవోలో 50 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు , మరో 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు వాటా కేటాయించనున్నారు.