పెద్దస్వాములును కఠినంగా శిక్షించాలి
1 min read– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD )
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కర్నూలు జిల్లా కల్లూరు మండలం కె.నాగలాపురం గ్రామానికి చెందిన ఓ వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన పెద్దస్వాములు అనే వ్యక్తి మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడని, అతడిని కఠినంగా శిక్షించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ముందు గాంధీ విగ్రహం వద్ద దివ్యాంగుల సంఘాలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD ) జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన దివ్యాంగురాలికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ కు వినతిపత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమంలో జిల్లా నాయకులు అభిలాష్, రామాంజనేయులు, ఎన్పీర్డీ రమేష్, కె. మధుబాబు తదితరులు పాల్గొన్నారు.