ఉదయం కంటే రాత్రిపూట మీ శరీరం అధిక బరువు ఎందుకు ఉంటుంది ?
1 min readపల్లెవెలుగు వెబ్ : కొద్దిగా బరువు పెరగాలన్నా.. కొద్దిగా తగ్గాలన్న కొన్ని నెలల సమయం పడుతుంది. కానీ ఒకరోజులోనే మన శరీర బరువులో తేడా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. శరీరంలోని నీటి పరిమాణం, ఉదయం నుంచి రాత్రిలోపు మనం తాగే నీళ్ల హెచ్చుతగ్గులే ఇందుకు కారణం. అలాగే చెమటపట్టడం, వేడికి ఒంట్లో నీరు ఆవిరి అవడం, మూత్రవిసర్జన, ఆహారవేళలు, పేగుకదలికలు కూడ శరీర బరువు మీద ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగా రాత్రిపూట ఉదయం కంటే అధికంగా బరువు ఉంటుంది. అలాగే వయసుతో పాటు, మారే కాలానికి తగ్గట్టు శరీర బరువులో తేడాలు కన్పిస్తాయి.