పదో తరగతిలో మళ్లీ మార్కులు !
1 min readపల్లెవెలుగు వెబ్: పదో తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానం తీసుకొస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల పై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికారు. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు గత ఏడాది నుంచి మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులకు ఒకే గ్రేడ్ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో ఇబ్బందులు ఏర్పడతాయని, ఈ నేపథ్యంలో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. 2019 మార్చి వరకు విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల ఇస్తారు. 2020 మార్చి నుంచి మార్కులు కేటాయిస్తారు.