మోచేతి పై దెబ్బతగిలితే ఎందుకు భరించలేమో తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : మన శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా తట్టుకోగలం కానీ.. మోచేతి పై దెబ్బతగిలితే మాత్రం తట్టుకోలేము. దానికి కారణం.. దెబ్బ తగిలేది ఎముకకు కాకుండా.. నరానికి కాబట్టి. మన శరీరంలో ఎన్నో నరాలుంటాయి. ఇవి మెదడు తోపాటు శరీరంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంటాయి. శరీర భాగాల నుంచి సమాచారాన్ని మెదడుకు, అక్కడ నుంచి ఆదేశాలను శరీర అవయవాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలోని ప్రతి నరానికి ఎముక గానీ, కండరాలు కానీ రక్షణ కల్పిస్తాయి. వాటిని ఆనుకుంటూ నాడీ వ్యవస్థ నిర్మితమై ఉంటుంది. కానీ మోచేతి కీలు వద్ద మాత్రం నరం బయటకు ఉంటుంది. దాని పై చర్మం మాత్రమే కప్పి ఉంటుంది. దెబ్బ తగిలినప్పుడు ఈ నరానికి స్వల్ప రక్షణ ఉండటం కారణంగా .. ఆ దెబ్బ నరం పై ప్రభావం చూపుతుంది.