సెప్టంబర్ నెలలో బ్యాంకు సెలవులు !
1 min readపల్లెవెలుగు వెబ్ : సెప్టంబర్ నెలలో పండుగ రోజులకు అనుగుణంగా బ్యాంకులకు సెలవులు మంజూరు అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారు. సెప్టంబర్ నెలలో వివిధ రాష్ట్రాల్లో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 7 రోజుల సెలవులు వస్తున్నాయి. 5,12,19,26 ఆదివారాలు కాగా.. 11వ తేది రెండో శనివారం, 25వ తేది నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. సెప్టంబర్ 10న వినాయక చవితి వస్తుంది. దీంతో వరుసగా 10,11,12 తేదిల్లో సెలవులు రానున్నాయి.