PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘సుంకేసుల’లో 150 బాక్సుల కర్ణాటక మద్యం పట్టివేత

1 min read

– ఐదుగురి అరెస్టు… బొలెరో వాహనం సీజ్​
– వెల్లడించిన కోడుమూరు సీఐ శ్రీధర్​, ఎక్సైజ్​ సీఐ బాష
పల్లెవెలుగు వెబ్​, గూడూరు: గూడురు పోలీస్​ స్టేషన్​ పరిధిలోని సుంకేసుల చెక్​ పోస్టు వద్ద శనివారం భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. గూడురు, సి.బెళగల్​ ఎస్​ఐలు వెంకటనారాయణ రెడ్డి, శివాంజల్​ సిబ్బందితో కలిసి చెక్​ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. బొలెరో వాహనంలో 150 బాక్సులు కర్ణాటక మద్యం గుర్తించారు. మద్యం విలువ రూ.5లక్షల 6వేలతో కొనుగోలు చేశారు. కోడుమూరు సీఐ శ్రీధర్, ఎక్సైజ్ సిఐ ఎస్ కె ఎమ్ భాష అక్రమ మద్యం రవాణా కేసు వివరాలను శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గూడూరు మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి, సాంబయ్య, రంగన్న, అహ్మద్, పులకుర్తి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కర్ణాటక జిల్లాలోని ఎరిగేరి నుండి 150 బాక్సులలో 12వేల టెట్రా ప్యాకెట్లను 5లక్షల 6 వేల రూపాయలకు కొనుగోలు చేసి ఐజ, రాజోలి మీదుగా సుంకేసుల చెక్పోస్టు దాటుతుండగా గూడూరు ఎస్ ఐ, సి.బెళగల్ ఎస్సై సెబ్ పోలీసు సిబ్బంది అక్రమంగా అక్రమంగా అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం వాహనం తో పాటు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు కోడుమూరు సీఐ శ్రీధర్ తెలిపారు. ఈ అక్రమ మద్యం మార్కెట్లో విలువ దాదాపు 10 లక్షల దాటుతుందని ఆయన తెలిపారు. కోడుమూరు సీఐ శ్రీధర్ తో పాటు గూడూరు ఎస్సై వెంకటనారాయణ, సి.బెళగల్ ఎస్ఐ శివాంజల్, గూడూరు ఏ ఎస్ ఐ గోపాల్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

About Author