సీపీఎస్ రద్దు కోరుతూ…1న నిరసన ర్యాలీ
1 min read– ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజిఎస్ గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: 2004 సెప్టెంబరు 1న అమలులోకి వచ్చిన సీపీఎస్ రద్దు కోరుతూ వచ్చే సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఏజిఎస్ గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు. శనివారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా… కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ విషయంపై పలు ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు వినతిపత్రం అందజేసినా.. నిరసన తెలిపినా.. ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో సెప్టెంబరు 1న అన్ని జిల్లాల్లోనూ నిర్వహించే నిరసన ర్యాలీలో ఆప్తా సభ్యలందరూ పాల్గొనాలని కోరారు.