80 శాతం లంగ్స్ పాడైపోయాయి.. ఒక్క రోజు ఆలస్యం అయితే చనిపోయేవాడిని !
1 min readపల్లెవెలుగు వెబ్ : తనకు రెండోసారి కరోన వచ్చినప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యానని సినీ నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. కనీసం మాట కూడ సరిగా రాలేదని, ఏ ఆస్పత్రికి ఫోన్ చేసిన బెడ్స్ లేవని చెప్పారని ఆనాటి పరిస్థితుల్ని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘ మా బాస్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేద్దామంటే.. ఆయనకు కూడ కరోన వచ్చింది. దీంతో చిరంజీవి గారికి ఫోన్ చేశా. ఏంటి గణేష్ అన్నారు. పరిస్థితి చెప్పాను. అటు నుంచి ఫోన్ కట్ అయింది. రెండు నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. అపోలో ఆస్పత్రిలో చెప్పాను.. అక్కడికి వెళ్లు అని చిరంజీవి గారు చెప్పారు. ఆస్పత్రికి వెళ్తే అక్కడ నా కోసం కనీసం పది మంది డాక్టర్లు వెయిట్ చేస్తున్నారు. పరీక్షలు చేస్తే 80 శాతం ఊపిరితిత్తులు పాడైపోయాయని అన్నారు. రెమిడెసివీర్ ఇంజెక్షన్ ఇచ్చారు. మూడు రోజులు ఐసీయూలో ఉన్నాను. ఒక్క రోజు ఆలస్యమైతే చనిపోయేవారని డాక్టర్లు చెప్పారు. ఇది తెలిసిన చిరంజీవి గారు అన్ని రోజులు ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని తిట్టారు.’ అంటూ కరోన సమయంలో తన అనుభవాలన్ని, చిరంజీవి చేసిన సహాయాన్ని చెప్పారు.