మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అయితే డెంగీ దోమలు ఉన్నట్టే !
1 min readపల్లెవెలుగు వెబ్ : మనీ ప్లాంట్ మొక్కలు. వీటిని ఇంటి ఆవరణలో పెంచితే సంపద వస్తుందని కొందరి నమ్మకం. అందుకే వీటిని ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా పెంచుతారు. ఈ మనీ ప్లాంట్ పెంచితే సంపద ఏమో కానీ.. దోమలు మాత్రం ఖచ్చితంగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంటి ఆవరణలో పెంచుకునే మనీ ప్లాంట్, తీగజాతి అలంకరణ మొక్కలు దోమలకు ఆలవాలంగా మారుతున్నాయి. డెంగీ దోమలు వీటిని ఆవాసంగా మార్చుకుంటున్నాయి. ఫలితంగా డెంగీకేసులు పెరుగుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా ఇలాంటి మొక్కలు పెంచుతారు. ఈ మొక్కలు డెంగీ దోమల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. దీంతో డెంగీ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి ఇంటి పరిసరాలను వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షపు నీటిని ఎక్కువ రోజులు ఇంటి ఆవరణలో నిల్వ ఉండకుండా చూడాలని చెబుతున్నారు.